Published on Dec 10, 2024 9:02 AM IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పటికే చాలా లేట్ గా అప్డేట్స్ ని స్టార్ట్ చేసి మళ్ళీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు.
ఇక సినిమా రిలీజ్ కి సరిగ్గా నెల మాత్రమే ఉన్నప్పటికీ ట్రైలర్ పై కానీ ఇతర సాంగ్స్ పై కానీ ఇంకా ఎలాంటి అప్డేట్ ని మేకర్స్ అందించలేదు. అయితే ఇపుడు ట్రైలర్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా ట్రైలర్ ని ఈ నెలాఖరుకి రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. మాములుగా ఇతర బిగ్ స్టార్స్ సినిమాల ట్రైలర్స్ ఒక నెల ముందే లేదా 15 రోజుల ముందే విడుదల చేసేస్తున్నారు. మళ్ళీ సినిమా రిలీజ్ ముందు రెండో ట్రైలర్ కూడా ఇస్తున్నారు. అయినప్పటికీ గేమ్ ఛేంజర్ కి ఇంత లేట్ గా రిలీజ్ చేస్తుండడం గమనార్హం.