- మోహన్ బాబు ఇంటికి చేరుకున్న పహడీ షరీఫ్ పోలీసులు
- అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం
- ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది
మంచు ఫామిలీ వివాదం గంటకో మలుపు, రోజుకో ట్విస్ట్ లతో అచ్చం ఓ పొలిటికల్ యాక్షన్ సినిమాలాగా సాగుతుంది. నిన్నటికి నిన్న తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని, తన ప్రాణానికి తన ఆస్తులకు రక్షణ కల్పించాలని రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేసాడు. మాదాపూర్ లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించి, నాకు హాని కలిగించే ఉద్దేశంతో, చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్, మౌనికలు ప్లాన్ చేశారు అని నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ని, నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి కేసు పెట్టాడు.
Also Read : Mega Family : ఆనందంలో మెగా ఫ్యాన్స్.. కారణం ఇదే.!
ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మోహన్ బాబు స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు ఆయన ఇంటికి చేరుకున్నారు పహడీ షరీఫ్ పోలీసులు. అయితే పోలీసులతో మోహన్ బాబు మాట్లాడుతూ ‘ ఏ ఇంట్లో నైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయి. అవి అందరి ఇళ్లలో ఉంటాయి. ఇళ్ళలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారు.మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది, దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. గతంలో నేను ఎన్నో కుటుంబాల సమస్యలను పరిష్కరించి వారి కుటుంబాలు కలిసేలా చేశా, ఇప్పుడు మా ఫ్యామిలీ తగాదా కూడా మేము పరిష్కరించుకుంటా’ అని అన్నట్టు తెలుస్తోంది. నిన్న కొడుకుపై కేసు పెట్టి నేడు అదేం లేదు అంతా తూచ్ అని మెం పరిష్కరించుకుంటాం అనడం ఏంటో ఆయనకె తెలియాలి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.