Legally Veer : రియల్ కోర్ట్ డ్రామా గా వస్తున్న‘లీగల్లీ వీర్’

సిల్వర్ కాస్ట్ బ్యానర్ మీద స్వర్గీయ ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో ‘లీగల్లీ వీర్’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. రవి గోగుల దర్శకత్వం వహించారు. సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

Also Read : Manchu Family : మాట మార్చి.. మడమ తిప్పిన మోహన్ బాబు..

ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో హీరో, వీర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు.  కరోనా టైంలో పాడ్ కాస్ట్ చేయాలని అనుకున్నాను. ఆ టైంలో నాకు సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. మంచి సినిమా చేద్దాం అనుకున్న, లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్రను చేయడం సులభంగా అనిపించింది. ఇంతవరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. నటనకు కొత్త కావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా టేక్స్ తీసుకున్న. డబ్బింగ్‌లో ప్రాబ్లం వచ్చింది కానీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డిసెంబర్ 27 విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. డైరెక్టర్ రవి మాట్లాడుతూ.. ‘వీర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపిస్తుంది. గ్లింప్స్ చూశాకా నాకు మాటలు రావడం లేదు. మా సినిమాకి మీడియా ప్రోత్సహించి, ఆదరించాలి’ అని అన్నారు. నటుడు గిరిధర్ మాట్లాడుతూ  ‘కొత్త టీం అయినా కూడా సినిమాని చాలా బాగా అద్భుతంగా చిత్రీకరించారు. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది కానీ ఇలాంటి టీం ఇంత వరకు చూడలేదు’ అని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *