Published on Dec 10, 2024 12:02 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప 2 కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ అవైటెడ్ చిత్రం రికార్డులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. మరి తెలుగు స్టేట్స్ సహా హిందీ ఇంకా యూఎస్ మార్కెట్ లలో కూడా పుష్ప 2 భారీ వసూళ్లు నమోదు చేస్తుండగా ఇవన్నీ కేవలం మొదటి వీకెండ్, 5 రోజుల్లోనే నమోదు అవుతున్నాయి.
మరి ఇలా లేటెస్ట్ గా పుష్ప 2 యూఎస్ మార్కెట్ లో మరో భారీ మైల్ స్టోన్ ని అందుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. లేటెస్ట్ యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రం ఏకంగా 10 మిలియన్ డాలర్స్ మార్క్ ని కొట్టి సూపర్ స్ట్రాంగ్ రన్ తో సెన్సేషనల్ లెవెల్లో దూసుకెళ్తుంది. దీనితో పుష్ప 2 మాత్రం అక్కడ ఆగేదేలే.. అన్న లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సామ్ సి ఎస్ అదనపు నేపథ్య సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.