Manchu Vishnu: పొట్ట చించుకుంటే.. పేగులు బయటపడతాయ్.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

  • ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు
  • మా కుటుంబం మీడియాతో సత్సంబంధాలు ఉన్నాయ్
  • ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉంటాయ్
  • మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు

ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదని మంచు విష్ణు అన్నారు. మూడు తరాలుగా తమ కుటుంబం మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉంటాయన్నారు. “ఎక్కువ మాట్లాడితే ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతాము.. నాకు ఇది చాలా పెయిన్ ఫుల్.. మేమెంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు.. మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాను.. మీకు కుటుంబాలు ఉన్నాయి… మీకు తండ్రులు ఉన్నారు.. ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి.. సెన్సేషన్ ఎందుకు అవుతుందో తెలియడం లేదు.. కేవలం మేము సెలబ్రిటీస్ కావడం వల్ల ఇలా చేస్తున్నారా?” అని మంచు విష్ణు తెలిపారు.

READ MORE: Woman Sold Her Child : భర్త అప్పు తీర్చేందుకు నెల రోజుల బిడ్డను అమ్మేసిన తల్లి.. ఎక్కడంటే?

తన తల్లికి ఇవ్వాళ ఆరోగ్యం బాగోలేదని… నాన్న నిన్నటి ఇష్యూ లో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని మంచు విష్ణు తెలిపారు. తాను కన్నప్ప షూటింగ్ లో ఉన్నట్లు చెప్పారు. గొడవల వల్ల నేను షూటింగ్ ఆపుకొని వచ్చేసినట్లు వెల్లడించారు. “ఫస్ట్ కుటుంబం ముఖ్యం అనుకున్నాను.. నిన్న ఒక జర్నలిస్టుకి గాయాలు అయ్యాయి.. చాలా దురదృష్టకరం.. దానికి చింతిస్తున్నాము.. నిన్న తండ్రిగా ఆయనా తపన చూడండి.. దండం పెడుతూ మీడియా ముందుకు వస్తుంటే ఆయనకి లోగో మొహం మీద పెట్టారు అని కోపం తో అలా చేశారు.. అలా జరిగి ఉండకూడదు.. మాకు నోటీసులు రాకముందు పోలీసులు మీడియాకి విడుదల చేశారు.. అది ఎలా సాధ్యం అవుతుంది.. ఈరోజు ఉదయం.. గన్ సబ్మిట్ చెయ్యాలని చెప్పారు.. మీడియాలో నిన్న విడుదల చేశారు..
ఇవ్వాళ 9.30 కి నోటీసు ఇచ్చి పదిన్నర కి హాజరు కావాలని అంటే ఎలా?.” అని మంచు విష్ణు ప్రశ్నించారు.

READ MORE:Tesla Showroom In Delhi: ఢిల్లీలో టెస్లా కార్ల షోరూం.. అనువైన స్థలం కోసం సెర్చ్!

కానీ లీగల్ గా ప్రొసీడ్ అవుతాం అని మంచు విష్ణు తెలిపారు.. “ప్రేమతో గెలవాల్సింది.. కానీ గొడవలు మార్గంగా ఎంచుకున్నారు.. పొట్ట చించుకుంటే… పేగులు బయటపడతాయి.. నేను నా కుటుంబం గురించి బయట మాట్లాడను.. మా నాన్న కష్టార్జితం ఆయన ఇష్టం.. ఆయన స్వయంకృషి తో ఎదిగారు… ఆయన లేకపోతే మేము లేము.. ఆయన ఆయన ఇంట్లో ఉండకూడదు అంటే.. ఉంటాను అనే హక్కు నాకు లేదు… నాన్న కి పలానా వ్యక్తి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అంటే… ఆయన మాటలకి రెస్పెక్ట్ చెయ్యాలి.. హద్దు మీరుతున్న మీడియా గురించే మేము తప్పు పడుతున్నాం.” అని ఆయన స్పష్టం చేశారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *