Spirit : స్పిరిట్ లో ప్రభాస్ లుక్ చూశారా.. అరాచకమే.. బాక్సాఫీసు బద్దలు కావడం ఖాయం

  • కొత్త లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్
  • రఫ్ లుక్‎లో అంచనాలు పెంచేస్తున్న డార్లింగ్
  • ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రభాస్ లుక్ క్రియేట్

Spirit : ప్రభాస్ ప్రతీ సినిమాతో తన పాన్ ఇండియా స్టార్ డమ్ అంతకంతకూ పెంచుకుంటున్నాడు. తన క్రేజ్ ప్రస్తుతం ఇండియాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఏ హీరోకు లేనంత స్టార్ లైనప్ ఒక్క ప్రభాస్ కే సొంతం. నెవ్వర్ బిఫోర్ అనేలా ఆయన కాంబినేషన్లు ఉన్నాయి. ఇక ప్రభాస్ త్వరలో స్టార్ట్ చేయబోయే కొత్త సినిమా ‘స్పిరిట్’ గురించి యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ప్రభాస్ పోలీస్ గెటప్‌లో ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్‌ను ప్రభాస్ అభిమానులు ఏఐ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేశారు. ప్రభాస్ పోలీస్ యూనిఫార్మ్‌లో సిగరెట్ తాగుతూ స్టైలిష్‌గా కనిపిస్తున్న ఆ ఫోటో చూసిన మరికొందరు అభిమానులు ‘స్పిరిట్’లో ఆయన లుక్ ఇదేనా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫోటోలో ప్రభాస్ స్టైలిష్ లుక్, పవర్ఫుల్ అటిట్యూడ్ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత వైరల్ చేసేస్తున్నారు.

Read Also:Manchu Vishnu: పొట్ట చించుకుంటే.. పేగులు బయటపడతాయ్.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

ఏదేమైనా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఇలా కనిపిస్తే మాత్రం అరాచకమే అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ అనేక ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’, ‘సలార్ పార్ట్ 2’, అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ‘స్పిరిట్’ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఇది ప్రభాస్ మొదటి పోలీస్ రోల్ కావడంతో ఆ పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. స్పిరిట్ గురించి ఇదివరకే వచ్చిన సమాచారం మేరకు.. ఇది ఒక పవర్ఫుల్ కథతో, పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్న కథాంశంతో వస్తుందని తెలుసోంది. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన డైరెక్షన్లో ప్రభాస్ నటించబోయే ఈ సినిమా టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా స్థాయిలో కూడా భారీ అంచనాలు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఈ సినిమా చిత్రీకరణ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also:Woman Sold Her Child : భర్త అప్పు తీర్చేందుకు నెల రోజుల బిడ్డను అమ్మేసిన తల్లి.. ఎక్కడంటే?

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *