మంచు ఇష్యూపై నోరు విప్పిన మంచు విష్ణు..! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

ప్రస్తుతం మన టాలీవుడ్ లో మంచు వారి ఇంట జరుగుతున్న ఇష్యూ కోసం అందరికీ తెలిసిందే. లెజెండరీ నటుడు మోహన్ బాబు అలాగే తన కొడుకు మంచు మనోజ్ ల విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు పైగా అయితే ఈ ఘటనలో హీరో అలాగే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఎంట్రీ ఇవ్వడంతో మరింత ఆసక్తిగా పరిస్థితులు మారాయి. అయితే ఫైనల్ గా దీనిపై మంచు విష్ణు ఓపెన్ కావడం జరిగింది.

తాను ప్రస్తుతం జరుగుతున్న కాంట్రవర్సీ పై మాట్లాడుతూ.. మా నాన్న గారు చేసిన పెద్ద తప్పుడు ఏమిటంటే మమ్మల్ని అతిగా ప్రేమించడం అని నిన్న మీడియా వారిపై జరిగిన దాడి కావాలని చేసింది కాదు అందుకు క్షమించాలని తాను కోరాడు. అసలు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనుకోలేదు. మూడు తరాలుగా నాన్నగారు అంటే ఏంటో అందరికీ తెలుసు. నేను లాస్ ఎంజెల్స్ లో కన్నప్ప వర్క్ లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసి .. అన్నీ వదిలి వచ్చేశాను.

పోలీసులు మా కంటే ముందు మీడియాకు నోటీసులు లీక్ అవుతున్నాయి.దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను ప్రేమలో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు మనోజ్ ఆరోపణలపై నేను చెప్పెది ఏమి లేదు. నేను ఇక్కడ ఉంటే ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు..నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం..ఎంతో కష్టపడి స్వయం కృషి తో గొప్ప స్దాయికి ఎదిగారు.

మాకిచ్చే లభించే గౌరవం ఆయనవల్లే.. మోహన్ బాబు పిల్లలుగానే‌..కుటుంబం పరంగా నాన్న గారు ఏది అనుకుంటే అదే ఉండాలి. అలాగే వీరి ఇష్యూలో కీలకంగా వినిపిస్తున్న వ్యక్తి వినయ్ కోసం కూడా తాను మాట్లాడ్డం జరిగింది. వినయ్ గారు నాకు అన్న లాంటి వారు.. ఆయన ఎవరిపైనా చేయి చేసుకోలా.. వినయ్ కు నాకు 15 ఏళ్ల పరిచయం ఉంది.. ఇండియాలోనే గొప్ప స్దాయి ఉన్న వ్యక్తి అని తాను పేర్కొన్నాడు. మా అక్కకు, నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కొట్టినా తిట్టినా నేను పడతాను.తను నా అక్క అని తెలిపాడు.

మా కుటుంబంలో బయటి వ్యక్తులు ఇన్ వాల్వ్ మెంట్ ఉంటే వారికి ఈవెనింగ్ దాకా సమయం ఇస్తున్నాము..మా నాన్న చెప్పిందే ఇది వేద వాక్కు ..ఆయన చెప్పింది నేను చెస్తాను.కానీ నా తమ్ముడిపై నేనిప్పుడు దాడులు చేయను..సమయమే అన్ని సమస్యలకి సమాధానం ఇస్తుంది..అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. అని మంచు విష్ణు తన బాధని వెళ్లగక్కుకోవడంతో తన ఎమోషనల్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

The post మంచు ఇష్యూపై నోరు విప్పిన మంచు విష్ణు..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *