Akhanda2  : బాలయ్య అఖండ -2 రిలీజ్ డేట్ వచ్చేసింది..

  • అఖండ -2 షూట్ స్టార్ట్ చేస్తున్న బోయపాటి
  • విడుదలకు రెడీగా ఉన్న డాకు మహారాజ్
  • వరుస సినిమాలతో బాలా బిజీబిజీ

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన  ‘సింహ‌’, ‘లెజెండ్’, ‘అఖండ‌’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకానొక దశలో ఇక సినిమా థియేటర్లు మూసివేద్దాము అనుకున్న టైమ్ లో వచ్చిన అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. అందులో  భాగంగానే   ‘అఖండ‌-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు.

Also Read : Manchu : మూడు రోజుల తర్వాత మోహన్ బాబు ఇంటివద్ద ప్రశాంత వాతావరణం..

ప్రస్తుతం బాలయ్య ‘డాకు మ‌హారాజ్’  సినిమాను సంక్రాంతికి రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖండ -2 ను సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు బాలా. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అఖండ -2 యాక్షన్ పార్ట్ తో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నామని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను తెలుగుతో పాటు పాన్ ఇండియా బాషలలో రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు  తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా  బాల‌య్య కుమార్తె తేజ‌స్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట‌-గోపీ అచంట ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *