హీరో కార్తీ (Hero kaarthi) తన సక్సెస్ ఫుల్ సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆయన ఖైదీ 2 (Kaithi 2), ఖాకీ 2 (khaaki 2) సినిమాలతో పాటు సర్దార్ 2 కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా సర్దార్ 2 సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. సర్దార్ (Sardar) సినిమా గతేడాది తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది.

దీపావళికి వచ్చిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. తాజాగా సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు పీఎస్ మిత్రన్ (PS mitran) తెరకెక్కించనున్నారు. ప్రిన్స్ మూవీస్ (Prince movies) సంస్థ నిర్మిస్తోంది. కార్తీ సర్దార్ లో వివిధ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన ఏజెంట్ క్యారెక్టర్ లో కనిపించిన సర్దార్ సక్సెస్ కాగా..ఇప్పుడు సర్దార్ 2 పై కోలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.