Sai Pallavi: ఇకపై ఊరుకునేది లేదు.. లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా: సాయిపల్లవి

  • వరుస సినిమాలతో బిజీగా సాయిపల్లవి
  • అమరన్‌తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి
  • ఇన్నాళ్లు సహించాను కానీ

‘బాక్సాఫీస్ క్వీన్’ సాయిపల్లవి ఇటీవలే ‘అమరన్‌’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘తండేల్‌’ చిత్రంలో నాగ చైతన్య సరసన నటిస్తున్న సాయిపల్లవి.. బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో నటించడానికి సిద్ధమయ్యారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

రామాయణ సినిమా కోసం సాయిపల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనాలు రాసింది. సినిమా పూర్తయ్యేవరకు మాంసాహారం ముట్టుకోరని, హోటల్స్‌ ఫుడ్ కూడా తినడం లేదని, విదేశాలకు కూడా తన వంట వాళ్లను తీసుకెళ్తున్నారని రాసుకొచ్చింది. ఈ వార్తలపై తాజాగా సాయిపల్లవి స్పందించారు. నిరాధారమైన పోస్ట్‌లు పెడితే లీగల్‌ యాక్షన్‌ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిరాధారమైన రూమర్స్‌ రాస్తే.. ఎంత పెద్ద సంస్థ అయినా ఊరుకునేది లేదని, లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా అని ఓ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Gabba Test: గబ్బాలో పేస్, బౌన్స్‌.. టీమిండియాకు పరీక్ష తప్పదు! 61 టెస్టుల్లో ఏడు సార్లు మాత్రమే

‘ఇప్పటికే నా గురించి ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. ప్రతిసారీ నేను మౌనంగానే ఉన్నా. ఎందుకంటే.. నిజం ఏంటో ఆ దేవుడికి తెలుసు. నేను మౌనంగా ఉంటున్నా అని రూమర్స్‌ ఇంకా ఎక్కువగా రాస్తున్నారు. నేను చాలా విసిగిపోయా. ఇన్నాళ్లు సహించాను కానీ.. ఇకపై ఊరుకునేది లేదు. స్పందించాల్సిన సమయం వచ్చింది. నా వ్యక్తిగతం, కెరీర్‌, సినిమా, యాడ్స్ ఏదైనా కావొచ్చు.. నాకు సంబంధించి నిరాధారమైన పోస్ట్‌లు, వార్తలు ప్రచురిస్తే లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా. గుర్తింపు పొందిన మీడియా అయినా లీగల్‌ యాక్షన్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని సాయిపల్లవి పోస్టులో పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *