daయంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న WAR 2 టీజర్ మంగళవారం విడుదలైంది. ఇది ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ కు ఇది ఫుల్‌ఫ్లెజ్డ్ గిఫ్ట్ అయ్యింది.

ఈ టీజర్‌లో తారక్‌ను పూర్తిగా పవర్‌ఫుల్ పాత్రలో చూపించారు. WAR 1 సినిమాలో టైగర్ ష్రాఫ్ పోషించిన సీరియస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రకు సమానంగా కానీ మరింత పవర్‌ఫుల్‌గా ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేసినట్టు టీజర్ చూస్తే స్పష్టమవుతుంది.

ఈసారి టీజర్ కట్ పూర్తిగా ఎన్టీఆర్ వాయిస్‌ ఓవర్‌తో ఉండటం విశేషం. హృతిక్ రోషన్ పాత్రను ఎప్పటిలానే స్టైలిష్‌గా చూపించారు. అయితే టీజర్‌లో NTR vs Hrithik అక్షరాలా ఫైర్ అన్న బజ్ మొదలైంది.

విజువల్‌గా ఇద్దరు హీరోలకు ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చినట్టు కనిపించింది. గ్రాండ్ లొకేషన్స్, హై ఓక్టేన్ యాక్షన్, మాస్ డైలాగ్ డెలివరీ – అన్నీ WAR 2 టీజర్‌ను కొత్త రేంజ్‌లో నిలబెట్టాయి.

WAR 2 సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రం YRF Spy Universeలో మరొక కీలక భాగం. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కానుంది.

ఇప్పటికే ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్ టీజర్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Twitter, Instagram లో టీజర్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *