- సూపర్ సక్సెస్ తో దూసుకు పోతున్న పుష్ప ది రూల్
- 1000 కోట్ల మార్క్ దాటేసిన పుష్ప ది రూల్
- టీంతో పార్టీ చేసుకున్న సుకుమార్
ఎందరో పెద్ద స్టార్ హీరోలు తమ శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కానీ రికార్డులను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బద్దలు కొడుతూ ముందుకు వెళ్తున్నాడు. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో ప్రతి భాష, రాష్ట్రం, దేశంలో రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రతి థియేటర్లో పుష్ప మ్యాజిక్ పనిచేస్తోంది. అల్లు అర్జున్ సినిమా విడుదలై ఆరు రోజులైంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఎవరూ ఊహించని ప్రతి హిందీ సినిమా రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టింది. ఈ సినిమా ఆరు రోజుల్లో ఇండియాలో రూ.645 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది, ఇది ఇప్పటి వరకు ఏ సినిమాకి రాని అత్యధిక వసూళ్లు ఈ సినిమా రాబట్టింది. నిన్నటికి ఈ సినిమా 1002 కోట్ల గ్రాస్ వసూళ్లు వసూలు చేసింది.
Rajinikanth Birthday: రామారావుతో రజనీ’బంధం’.. ఈ విషయాలు మీకు తెలుసా?
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ పొందుతోంది. అత్యంత వేగంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. ఇక పుష్ప 2 సక్సెస్ నేపథ్యంలో డైరెక్షన్ టీం నిన్న పార్టీ చేసుకుంది. హైదరాబాదులోని ఒక పబ్బులో దర్శకుడు సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్ సహా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పార్టీకు హాజరయ్యారు. ఇక పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ ‘పుష్ప 2’ కథను మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. సినిమా చివర్లో ‘పుష్ప 3’ని కూడా తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఏడో రోజుకు చేరుకుంది. మరి ఈ సినిమా ఎన్ని కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేస్తుందో చూడాలి.