పుష్ప 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 క్లైమాక్స్ లో అల్లు అర్జున్ శత్రువుల పీక కొరికే యాక్షన్ సీన్ అదిరింది. మరి దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో తెలియదు కానీ పుష్ప 2 ప్రదర్శితమవుతున్న థియేటర్ కాంటీన్ ఓనర్ ఒకరు తన కస్టమర్ చెవులు కొరికిన ఘటన సంచలనంగా మారింది. గ్వాలియర్‌లో కాంటీన్ బిల్లు చెల్లించే విషయంలో జరిగిన వివాదంలో ఓ వ్యక్తి ఓ యువకుడి చెవి కొరికాడు ఓనర్. అసలు విషయం ఏమిటంటే ఇందర్‌గంజ్ ప్రాంతంలోని కైలాష్ టాకీస్‌లో పుష్ప 2 ప్రదర్శితమవుతోంది. పుష్ప 2 ఇంటర్వెల్‌లో స్నాక్స్ కొనేందుకు బాధితుడు షబ్బీర్ క్యాంటీన్‌కు వెళ్లగా ఆదివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు బుధవారం తెలిపారు. గ్వాలియర్‌లోని ఫాల్కా బజార్‌లో ఉన్న కాజల్ టాకీస్‌లో పుష్ప-2 ది రూల్ చిత్రం ప్రదర్శించబడుతోంది. గ్వాలియర్‌లోని గూడ గుడి బ్లాక్‌కు చెందిన షబ్బీర్ అనే యువకుడు కూడా సినిమా చూసేందుకు వచ్చాడు.
Manchu Manoj: గొడవలకు బ్రేక్.. షూటింగ్‌కి మనోజ్
క్యాంటీన్‌లో పనిచేస్తున్న రాజు, చందన్, ఎంఏ ఖాన్‌తో డబ్బు విషయంలో గొడవ జరిగింది. వివాదం ముదిరి ముగ్గురూ కలిసి ముందుగా షబ్బీర్‌ను కొట్టగా, వారిలో ఒకరు సినీ నటుడు అల్లు అర్జున్ స్టైల్‌లో చెవిని నోటితో కొరికాడు. ఈ క్రమంలో పుష్ప చిత్రం ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, ప్రజలు తమను తాము పెద్ద గూండాలుగా, కిరాతకులుగా భావించడం ప్రారంభించారని బాధితుడు షబ్బీర్ అన్నారు. బాధితుడి చెవికి దాదాపు ఎనిమిది కుట్లు పడ్డాయి. రక్తస్రావమైన స్థితిలో షబ్బీర్ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. అనంతరం ఇందర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ముగ్గురు నిందితులపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతనికి వైద్య పరీక్షలు చేయించారు, ఆ తర్వాత వారు రాజు, చందన్ మరియు వారి సహచరుడు MA ఖాన్‌పై BNS సెక్షన్లు 294, 323 మరియు 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షబ్బీర్ మెడికల్ రిపోర్టు రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇతరులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులు చెబుతున్నారు.