ఫోటో మూమెంట్: తన తల్లితో అల్లు అర్జున్ బ్యూటిఫుల్ పోస్ట్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 12, 2024 12:05 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ అవైటెడ్ సీక్వెల్ రికార్డు వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా దగ్గర ఫాస్టెస్ట్ 1000 కోట్ల గ్రాసింగ్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా అందుకున్న ఈ భారీ సక్సెస్ లో మేకర్స్ ఢిల్లీలో నేడు ఓ సక్సెస్ మీట్ ని పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి అల్లు అర్జున్ కూడా ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అయ్యాడు.

కానీ అంతకు ముందు మాత్రం తన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తన మాతృమూర్తి నిర్మల గారితో జరిపిన చిన్నపాటి కన్వర్జేషన్ తాలూకా బ్యూటిఫుల్ పోస్ట్ ని తాను పోస్ట్ చేసాడు. మరి తన తల్లి ఎదురుగా నిలబడి అల్లు అర్జున్ కనిపిస్తుండగా ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. దీనితో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని షేర్ చేసుకొని ఎంతో అందమైన ఈ ఉదయం మరింత అందంగా మొదలైంది అంటూ పోస్ట్ చేసాడు. దీనితో ఈ పిక్ మంచి ఫొటో మూమెంట్ గా మారింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *