Ajith Kumar Launches YouTube Channel For Racing Content

తమిళ స్టార్ అజిత్ కుమార్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు 63 చిత్రాల్లో నటించి, ఎన్నో విజయాలు అందుకున్న అజిత్.. ఇప్పుడు తన కార్ రేసింగ్ ప్రేయసను అభిమానులతో పంచుకోవడానికి “Ajith Kumar Racing” పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. 2025 మే 24న మధ్యాహ్నం 12:30కు మిసానో వరల్డ్ సర్క్యూట్ నుంచి ఛానల్ లైవ్‌లోకి వచ్చింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ, విడాముయార్చి వంటి సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అజిత్.. సినిమాలతోపాటు రేసింగ్ పైనే తన దృష్టి పెట్టారు. ఇప్పటికే మూడు అంతర్జాతీయ రేసుల్లో పాల్గొని, రెండు పోటీల్లో మూడవ స్థానం, ఒకదానిలో రెండవ స్థానం సాధించారు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండే అజిత్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఛానల్‌లో రేసింగ్ వీడియోలు, బిహైండ్ ద సీన్స్ ఫుటేజ్లు, ఇంటర్వ్యూలు షేర్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపై సినిమాలు కాకుండా అజిత్‌ యొక్క రేసింగ్ అద్భుతాలు యూట్యూబ్‌లో ప్రత్యక్షంగా చూడొచ్చు!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *