టాలీవుడ్‌లో యంగ్ హీరోలే కాదు, సీనియర్ హీరోలు కూడా మళ్లీ జోరు చూపిస్తున్నారు. మూడున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీని నిలబెట్టిన నాలుగు పిలర్స్‌లో ముగ్గురు హీరోలు ఇప్పటికీ బాక్సాఫీస్ దూసుకుపోతున్నారు. నాగార్జున మాత్రం సరైన సినిమాతో ఇంకా వసూళ్ల పరంగా మెప్పించాల్సిన అవసరం ఉంది.
వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన “వస్తున్నాం” సినిమా ద్వారా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సీనియర్లలో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. 25 ఏళ్ల క్రితం “కలిసుందాం రా”తో కూడా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వెంకీ, మళ్లీ అదే మేజిక్ రిపీట్ చేశాడు. ప్రస్తుతం వెంకటేష్ పేరు మీదే highest regional grosser రికార్డు ఉంది.
మరోవైపు చిరంజీవి 100 కోట్ల షేర్ అందుకున్న తొలి సీనియర్ హీరో. “ఖైదీ నెం.150” తో సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు, “సైరా”, “వాల్తేరు వీరయ్య” వంటి సినిమాలతో 200 కోట్ల గ్రాస్ సాధించాడు. రీ ఎంట్రీ తరువాత అతడి స్టామినా బాక్సాఫీస్ రేంజ్‌ను ఎలివేట్ చేసింది.
బాలకృష్ణ సైతం 100 కోట్ల క్లబ్‌లో స్థిరంగా నిలిచారు. “అఖండ” సినిమాతో మొదలైన విజయ పథం “వీరసింహారెడ్డి”, “భగవంత్ కేసరి”, “డాకు మహారాజ్” వరకు కొనసాగింది. ఫ్యాన్స్‌ను అలరించడమే కాక, వరుసగా హిట్స్ ఇస్తూ బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించారు.
ఇక నాగార్జున విషయానికి వస్తే, సరైన కంటెంట్ వస్తే కింగ్ కూడా రీ ఎంట్రీలో అద్భుతాలు చేస్తారు. అక్కినేని అభిమానులు ఆయన strong comeback కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.