No Clarity On Star Hero Films Release
No Clarity On Star Hero Films Release

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో రూపొందుతున్న సోసియో ఫాంటసీ చిత్రం విశ్వంభర (Vishwambhara), ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. 2024 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యంతో ఇప్పటికీ థియేటర్లలోకి రాలేదు.

ఇంతలో సమ్మర్, దసరా లాంటి మంచి సీజన్‌లు మిస్ అవడంతో ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది స్పష్టత లేకుండా పోయింది. ఇదే విధంగా మరో స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ది రాజాసాబ్ (The Raja Saab) సినిమా పరిస్థితీ అదే. హారర్ కామెడీ జానర్‌లో వస్తున్న ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. కానీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మేకర్స్ మాత్రం ప్రమోషన్స్‌లోనూ, అప్డేట్స్‌లోనూ చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తున్నారు.

ఇదే తరహాలో కేజీఎఫ్ స్టార్ యష్ (Yash) హీరోగా నటిస్తున్న టాక్సిక్ (Toxic) సినిమా కూడా అభిమానులను వేటింగ్‌లో ఉంచింది. రెండేళ్ల క్రితమే అనౌన్స్ చేసినా, ఇప్పటివరకు సినిమా విడుదలకు సిద్ధం కాలేదు. 2026 మార్చి టార్గెట్ అని ప్రకటించడంతో రాకీ భాయ్ అభిమానుల నిరీక్షణ మరింత పెరిగిపోయింది. ఇలా టాలీవుడ్, పాన్ ఇండియా స్టార్‌ల సినిమాల డిలే అభిమానుల ఆతృతను మరింత పెంచుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *