Manchu Family Controversy : మీడియాకు మోహన్ బాబు ఆడియో సందేశం

  • మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు
  • ఆడియో సందేశం రిలీజ్ చేసిన మోహన్ బాబు
  • ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా

మంచు మోహన్ బాబు మీడియా దాడి చేసి ఓ జర్నలిస్ట్ ను దాని చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు మోహన్ బాబు తాను గాయపడగా ఆసుపత్రిలో చేరారు. నేడు మొహన్ బాబు ఆసుపత్రి నుండి డిశ్చార్చి అయ్యారు. మీడియాపై దాడి చేసిన నేపథ్యంలో మోహన్ బాబు పై తీవ్ర విమర్శలు వస్తుండడంతో మీడియాకు ఆడియో సందేశం అందించారు.

Also Read : Nithiin : రాబిన్ హుడ్ క్రిస్మస్ రిలీజ్ లేనట్టే..?

‘ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా. ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలి. ఇలా మీడియాపై దాడి చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. పత్రికా సోదరుల అలా గేట్లు తోసుకుని లోపలి రావడం ఎంత వరకు సమంజసం. ఆ రోజూ బయటకు వెళ్తూ వారికి నమస్కారం చేసి   మా ఫ్యామిలీ మ్యాటర్ నేను తేల్చుకుంటా దీన్ని వివాదం చేయద్దు అని చెప్పాను. రాత్రుళ్ళు గేట్లు తోసుకుని రావడం ఎంత వరకు కరెక్ట్. నేను ఏకాగ్రత కోల్పోయి దాడి చేశాను. అతడికి దెబ్బతగిలింది అని తెలిసి భాదపడుతున్నాను. ఆ దాడిలో నా కంటికి గాయమయింది. గేట్లు పగలకొట్టి లోపలికి వచ్చిన వాళ్ళు మీడియా వాళ్ళ లేదా నా మీద రాగద్వేషాలు ఉన్నవారా అన్నది తెలియదు. ఆరోజు నేనెంత ఆవేదనకు గురయ్యానో మీరు అర్థం చేసుకోవాలి. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు. దాడి చేయడం తప్పే, నా పరిస్థితి సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. జరిగిన ఘటనకు బాధపడుతున్నాను. నీతిగా నిజాయతీగా బ్రతుకుతున్నాను మా ఫ్యామిలీ విషయాన్ని మేమే తేల్చుకుంటాంమధ్య వర్తిత్వం అవసరం లేదు. నేను చేసిన సాయాన్ని మర్చిపోయి కొట్టిందాని గురించే  మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఇలాగే దూరితే ఊరుకుంటారా. మీరే ఆలోచించుకోండి’ అని అన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *