ఈ దీపావళి టాలివుడ్ కు చాలా స్పెషల్. దివాళి కానుకగా క, లక్కీభాస్కర్, అమరన్, బఘీర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో బఘీర తప్పించి మిగిలిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి. క, లక్కీభాస్కర్ ప్రీమియర్స్ తోనే యూనానిమస్ టాక్ అందుకున్నాయి. ఇక పండగ రోజు అమరన్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సత్తా చాటింది. మూడు సినిమాలు ఈ ముగ్గురి హీరోలకు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక విషయం ఉంది. పైన చెప్పుకున్న మూడు సినిమాలలో స్టార్ హీరోస్ లేరు. మాస్ మసాలా కంటెంట్ అసలే లేదు. ఐటం సాంగ్స్ ఊసే లేదు. అధిక ధర టికెట్స్ మాటే లేదు. మరి ఇంత కలెక్షన్స్ ఇంత రెవెన్యూ..ఎలా అంటే ఒకటే సమాధానం కథ. సరికొత్త కొథతో సరైన కథాంశంతో ప్రేక్షకులకు కొత్తదనం అందించారు. ఆడియన్స్ తో శెభాస్ అనిపించుకున్నారు దర్ళకులు.
Also Read : Manchu Family Controversy : మీడియాకు మోహన్ బాబు ఆడియో సందేశం
ఈ సినిమాల రిజల్ట్ కొందరు దర్శకులకు నిర్మాతలకు చిన్నపాటి వార్నింగ్ లాంటిది అనుకోవచ్చు..ఎప్పుడు రోటిన్ రొడ్డు కొట్టుడు సినిమాలు తీసి, అవి యావరేజ్ కలెక్షన్స్ రాబట్టిన ఆహ ఓహో అనే నంబర్స్ పోస్టర్స్ వేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి.. అలాగే ఓటీటీ వలన ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదు అనే ఒట్టి మాటలు కట్టి పెట్టాలి. ఓటీటీ రిలీజ్ చేసిన తర్వాత కూడా లక్కీ భాస్కర్, అమరన్ కు ఎందుకు అంత భారీ కలెక్షన్స్ వస్తున్నాయో చెప్పగలరా. ఇక్కడ కంటెంట్ బాగుంటే చాలు ఓటీటీలో వచ్చినా కూడా థియేటర్స్ లో అదరిస్తారు. ఇక్కడ ఎటువంటి సినిమా ఇస్తున్నాం అనేది మ్యాటర్. కమీటీ కుర్రాళ్ళు కూడా కంటెంటే కింగ్ అని నిరుపించిన సినిమా. ఇక మన దర్శకులు రెగ్యులర్ గా చెప్పే మరో మాట రివ్యూస్. ఫలానా సినిమా బాగుండి రెటింగ్స్ వలన ఫ్లాప్ అయింది ఏది అంటే రక్కున చెప్పలేని పరిస్థితి. రివ్యూస్ యావరరేజ్ గా వచ్చిన అదరగొట్టిన సినిమా అంటే కళ్ళ ముందే దేవర కనబడుతుంది. చెప్పోచ్చేది ఒకటే.. కధ, కధనాల మీద దృష్టి పెట్టి సినిమాలు తీస్తే టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడు బాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారని తెలుసుకుంటే థియేటర్స్ తో పాటు టాలీవుడ్ కూడా కళకళలాడుతుంది..