
బాలీవుడ్లో స్పై యూనివర్స్‌కు ప్రారంభం చెప్పిన చిత్రం ఏక్తా టైగర్. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ పాకిస్థానీ ఏజెంట్‌గా అలరించారు. అయితే ఈ సిరీస్‌లో క్యాట్ పాత్రకు పెద్దగా గ్లామర్ స్కోప్ లేకపోయింది. కానీ ఆమె రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మాత్రం గ్లామర్ పరంగా ప్రత్యేకంగా నిలిచారు.
అనంతరం వచ్చిన వార్ సినిమాలో, వాణీ కపూర్ హృతిక్ రోషన్ జోడీగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కథలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా, గుంగ్రూ పాటలో బికినీలో చేసిన గ్లామర్ షో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఇదే ట్రెండ్‌కు స్పై యూనివర్స్‌లో కొత్త టచ్ ఇచ్చింది.
పఠాన్ సినిమాలో షారూఖ్ ఖాన్‌తో కలిసి దీపికా పదుకొనె నటించారు. ఈ మూవీలో దీపికా ఆరెంజ్ బికినీ సీన్ హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్‌కు మంచి స్పేస్ ఇచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులలో మంచి రీచ్ సాధించింది.
టైగర్ 3లో కత్రినా కైఫ్ మరింత గ్లామరస్ అవతారంలో కనిపించారు. బికినీ రేంజ్లో కాకపోయినా, గత సినిమాల కంటే చాలా హాట్ లుక్‌ను ప్రదర్శించారు. అయితే ఈ సినిమా భారీ హైప్ ఉన్నా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇప్పుడు ఇదే గ్లామర్ ట్రెండ్‌ను వార్ 2లో కియారా అద్వానీ కొనసాగిస్తున్నారు. బికినీలో వావ్ అనిపించే లుక్‌లో కియారా కనిపించనుండగా, ఆమె తారక్ (ఎన్టీఆర్) సరసన స్క్రీన్ షేర్ చేయనున్నారు. ఈ చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.