ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ హిట్ చిత్రం “పుష్ప 2” ఎలాంటి రికార్డులు సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ చిత్రం అన్ని రికార్డులు తిరగరాసి దుమ్ము లేపింది. అయితే ఈ సినిమా హిట్ వైబ్స్ లో ఉంటే అల్లు అర్జున్ పై పలు షాకింగ్ రూమర్స్ ఇపుడు ఆకస్మికంగా వచ్చాయి. పుష్ప 2 చిత్రం 1000 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసిన స్సందర్భంగా ఢిల్లీలో నేడు థాంక్స్ మీట్ ని పెట్టారు.
అయితే ఈ సమయంలోనే అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం అంటూ పలు షాకింగ్ వార్తలు వైరల్ అయ్యాయి. మరి వీటిపై ఇపుడు వెంటనే క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తన కాంపౌండ్ నుంచి అఫీషియల్ క్లారిటీ ఇపుడు వచ్చేసింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారు అని స్ప్రెడ్ అవుతున్న వార్తలని తాము ఖండిస్తున్నామని, ధృవీకరించని సమాచారాన్ని స్ప్రెడ్ చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కి సంబంధించి అప్డేట్స్ ఏమన్నా ఉంటే తమ టీం నుంచే వస్తాయని క్లారిటీ ఇచ్చారు.
The post రాజకీయాల్లోకి అల్లు అర్జున్ ఎంట్రీపై క్లారిటీ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.