తెలుగు తమిళ సినీ ప్రేక్షకులకు నేడు సుపరిచితమైన పేరు దివ్య భారతి (Divya Bharathi). తన తొలి చిత్రం బ్యాచిలర్ (Bachelor) తోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ స్థానం ఏర్పరుచుకుంటోంది. జీవీ ప్రకాష్ సరసన నటించిన ఈ సినిమా ఆమెకు ఊహించని స్థాయిలో క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.
తర్వాత తమిళంలో మదిల్ మెయిల్ కాదల్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు టెలివిజన్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ (G.O.A.T) సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సినిమాలతో పాటు, సోషల్ మీడియా లో కూడా దివ్య ఫాలోయింగ్ జోరుగా సాగుతోంది.
తన గతం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కాలేజీ రోజుల్లో తన బాడీ షేప్ గురించి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నానో వివరించింది. ఫాండా బాటిల్, అస్థిపంజరం అంటూ మాట్లాడేవారన్నది ఆమె బాధ. వీటి వల్ల నడవటానికే భయపడేదాన్నని తెలిపింది. కానీ 2015లో తన మొదటి ఇన్‌స్టాగ్రామ్ ఫోటోకు వచ్చిన పాజిటివ్ కామెంట్స్ ఆమెకు నమ్మకాన్ని ఇచ్చాయని చెప్పింది.
ఇప్పుడు దివ్య, క్రేజీ ఫోటోషూట్స్ తో నెట్టింట గ్లామర్ సెన్సేషన్ అవుతోంది. విమర్శలు ఎదుర్కొన్నా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న దివ్య జీవితం యువతకు స్పూర్తిదాయకం.