విక్టరీ వెంకటేష్‌ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడూ స్పెషల్ కనెక్షన్ చూపిస్తారు. ఇటీవల సంక్రాంతికి వచ్చిన ‘సిక్స్‌టీ ప్లస్’ సినిమాతో వెంకటేష్ మరోసారి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. అయితే ఆయన కెరీర్‌లో చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లో ‘దేవీపుత్రుడు (Devi Putrudu)’ ప్రత్యేక స్థానం దక్కించుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ కాలేకపోయినా, టెక్నికల్‌గా మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. సముద్రం అడుగున శ్రీకృష్ణుడి ద్వారకను చూపించే కాన్సెప్ట్ అద్భుతంగా హైలైట్ అయింది.

ఈ చిత్రంలో వెంకటేష్ డ్యూయల్ రోల్ చేసి ఆకట్టుకోగా, హీరోయిన్‌లుగా సౌందర్య, అంజలా జవేరి నటించారు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫాంటసీ డ్రామాలో శ్రీకృష్ణుడి ద్వారక నేపథ్యంగా వచ్చే పాటలో ఓ చిన్నారి కనిపిస్తుంది. ఆ క్యూట్ బేబీ ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసుకోవాలని నెటిజన్స్ తరచూ గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.

ఆ చిన్నారి పేరు వేగా తమోటియా (Vega Tamotia). ఆమె అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో కనిపించి, తర్వాత హీరోయిన్‌గా మారింది. ‘హ్యాపీ హ్యాపీగా’ అనే చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన నటించింది. తరువాత తమిళం, హిందీ సినిమాల్లో కూడా మెరిసింది. నటనతోపాటు, నిర్మాతగా కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన తాజా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇప్పుడు ఆమె స్టైలిష్ లుక్స్ చూసి నెటిజన్లు సర్ప్రైజ్ అవుతున్నారు!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *