
సినీ ప్రేక్షకులకు ‘అలా మొదలైంది’ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో గుర్తుండిపోయిన నటి స్నిగ్దా, ప్రస్తుతం సినిమాల కన్నా ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోంది. పరమశివుని భక్తురాలిగా గుర్తింపు పొందిన ఆమె ప్రతీసంవత్సరం శివమాల ధరించడం ఆనవాయితీగా కొనసాగిస్తోంది.
తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడిన స్నిగ్దా, “నాకు పెళ్లిపై ఆసక్తి లేదు. పెళ్లి చేసుకుంటే మరొకరి కంట్రోల్‌లోకి వెళ్లిపోవాలి కాబట్టి నో అంటున్నా” అని వెల్లడించింది. 43 ఏళ్లు వచ్చినా పెళ్లి చేయాలన్న ఆలోచన రాలేదంటూ స్పష్టం చేసింది.
అలాగే, “తనకు షర్ట్, ప్యాంట్ లాంటి డ్రెస్సింగ్‌నే ఇష్టం, అబ్బాయిలా కనిపించడమే కంఫర్ట్” అని చెప్పిన స్నిగ్దా, తాను పూర్తిగా అమ్మాయినేనని.. ప్రతి నెలా పీరియడ్స్ వస్తాయని ఓపెన్‌గా చెప్పి తన నిజాయితీని మరోసారి చాటింది.
సినిమాల్లో మెల్లగా తగ్గించినా, నిజజీవితంలోనూ డేర్ అండ్ డాషింగ్ టామ్‌బాయ్‌గా జీవిస్తున్న స్నిగ్దా జీవన విధానం చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.
తమ యూనీక్ వ్యక్తిత్వాన్ని దాచకుండా బోల్డ్‌గా జీవించే స్టార్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇలా చూడండి.