
రియల్ హీరోగా పేరు సంపాదించిన నటుడు సోనూ సూద్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. సామాజిక సేవలతో ప్రజల మనసు గెలిచిన సోనూ సూద్, తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో బైక్ రైడింగ్ చేస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో అతను హెల్మెట్ ధరించకుండానే, చొక్కా లేకుండా బైక్ నడుపుతున్నాడు. దీన్ని చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రజలకు ఆదర్శంగా నిలిచే వ్యక్తిగా ఉండాల్సిన సోనూ సూద్ ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. “సెలబ్రిటీలకు చట్టం వర్తించదా?”, “హెల్మెట్ లేకుండా ప్రమాదకరమైన మార్గాల్లో బైక్ నడిపినందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారా?” అంటూ ట్విట్టర్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వీడియోలో సోనూ షార్ట్ వేసుకొని, పర్వత ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తుండటం అత్యంత ప్రమాదకరమని వారు మండిపడుతున్నారు.
ఈ వైరల్ వీడియోపై స్పందించిన స్పితి పోలీసులు, వీడియో 2023లో తీసినదిగా అనుమానం వ్యక్తం చేశారు. “వీడియో ప్రామాణికతను ధృవీకరించిన తర్వాత అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని వారు పేర్కొన్నారు. ఈ వివాదంతో సోనూ సూద్ తిరిగి వార్తల్లోకి ఎక్కినాడు.
అందరూ ఫాలో అవుతున్న వ్యక్తిగా సోనూ సూద్ మరింత జాగ్రత్తగా ప్రవర్తించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. పబ్లిక్ ఫిగర్‌గా బాధ్యతాయుతంగా వ్యవహరించడమే మోడల్ రెస్పాన్స్ అనే వాదన జోరుగా వినిపిస్తోంది.