Naveen Polishetty’s Next Locked for Sankranthi – Clash with Chiranjeevi!
Naveen Polishetty’s Next Locked for Sankranthi – Clash with Chiranjeevi!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు వంటి సినిమాలతో నవీన్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే గత కొంతకాలంగా నవీన్ నుంచి కొత్త మూవీ అనౌన్స్మెంట్స్ లేని నేపథ్యంలో పలు రూమర్లు వినిపించాయి.

అయితే ఇప్పుడు నవీన్ నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన ప్రీ వెడ్డింగ్ గ్లింప్స్ వీడియో మరియు రిలీజ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లుంగీ, బనియన్ ధరించి, నోట్లో వేపపుల్లతో నవీన్ బైక్‌పై ఎంట్రీ ఇచ్చిన లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన వీడియోలు చూసిన నెటిజన్లు నవీన్ తన కామెడీ టచ్‌తో మళ్లీ పండించబోతున్నాడని అంటున్నారు.

అయితే ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కూడా సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతోంది. అంటే సంక్రాంతి బరిలోకి నవీన్ పోలిశెట్టి కూడా దిగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ పోటీలో నవీన్ సినిమా ఏ రేంజ్‌లో స్టాండౌట్ అవుతుంది? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *