RJ Kajal Buys New House – Celebrities Celebrate Her Housewarming in Style!
RJ Kajal Buys New House – Celebrities Celebrate Her Housewarming in Style!

బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన తారలలో ఆర్జే కాజల్ ఒకరు. బిగ్ బాస్ తర్వాత సినిమాలు, టీవీ షోలు, యూట్యూబ్, వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆర్జే కాజల్ తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. హైదరాబాద్ లో నూతన ఇంటిని కొనుగోలు చేసి, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ సమక్షంలో గృహ ప్రవేశ వేడుక జరుపుకుంది.

ఈ వేడుకలో బిగ్ బాస్ తారలు ప్రియాంక జైన్, సిరి హన్మంత్, సింగర్ లిప్సిక పాల్గొని కాజల్‌కి శుభాకాంక్షలు తెలిపారు. సింగర్ లిప్సిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లిప్సిక మాట్లాడుతూ – “మీ ఈ సొంతింటి కలను నెరవేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ బాల్కనీ ప్రత్యేకంగా నచ్చింది. సెలెబ్రేషన్స్ కొనసాగుతాయి,” అంటూ భావోద్వేగంగా చెప్పింది. అదే సమయంలో సిరి హన్మంత్ మాట్లాడుతూ – “ఇది సాధించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది” అని తెలిపింది.

కాజల్ కూడా స్పందిస్తూ – “నా జర్నీలో భాగమైనందుకు థాంక్యూ సిరి.. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా” అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఆర్జే కాజల్ కొత్త ఇంటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు, బుల్లితెర సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *