This Kid Dressed as Krishna is Now a Tollywood Star
This Kid Dressed as Krishna is Now a Tollywood Star

పై ఫోటోలో కృష్ణుడి వేషంలో కనిపిస్తున్న ఆ చిన్నపిల్లవాడు ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీగా వెలుగొందుతున్నాడు. అతనే తరుణ్ భాస్కర్. దర్శకుడిగా, హీరోగా, నటుడిగా, విలన్‌గా.. ఇలా అన్ని కోణాల్లో తన సత్తా చాటిన తరుణ్, ఈ తరం టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ లో ఒకరు.

చెన్నైలో జన్మించినప్పటికీ హైదరాబాద్‌లో పెరిగిన తరుణ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివి, స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుని షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

తన తొలి సినిమాగా తెరకెక్కించిన “పెళ్లి చూపులు” తోనే జాతీయ అవార్డు గెలుచుకున్న తరుణ్ భాస్కర్, “ఎమైంది ఈ నగరానికి”, “కీడా కోలా” వంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నాడు. నటుడిగా కూడా “హిట్ 2”, “మహా సముద్రం” వంటి చిత్రాల్లో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువగా కనిపిస్తున్న తరుణ్, త్వరలోనే మరో డైరెక్షన్ ప్రాజెక్ట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా తన తల్లితో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఫోటోలోని కృష్ణుడిని గుర్తించలేక ఆశ్చర్యపోతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *