Will Pawan Kalyan’s Films Deliver Their Big Break

పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారిగా పీరియాడిక్ రోల్ చేస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ జూన్ 12న విడుదల కానుంది. ఎన్నో మాళ్ళ వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా మళ్లీ టాలీవుడ్‌లో హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్, ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ మంచి జోష్ తీసుకొచ్చారు.

ఈ సినిమా ద్వారా నిథి అగర్వాల్ పెద్ద బ్రేక్ అందుకుంటారని ఆశిస్తున్నారు. పుష్కలంగా టాలెంట్ ఉన్నా ఇప్పటి వరకు పూర్తిగా సెటిలవని ఈ బ్యూటీ, పవన్ మూవీతో తన కెరీర్ టర్నింగ్ పాయింట్ వస్తుందని నమ్ముతున్నారు.

ఇక మరోవైపు, పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఓజీ’ సినిమా రిలీజ్ మీద స్పష్టత రావడంతో ప్రియాంక అరుళ్ మోహన్లో కూడా కొత్త ఎనర్జీ కనిపిస్తోంది. ఈ చిత్రంతో ఆమెకు టాలీవుడ్‌లో స్థిరమైన స్థానం లభించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, శ్రీలీల పవన్ సరసన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఈ సినిమాతో టాప్ లీగ్‌కు ఎంట్రీ ఇస్తారని ఇండస్ట్రీ టాక్.

ఈ ముగ్గురు హీరోయిన్లు పవన్ కళ్యాణ్ సినిమాలపై భవిష్యత్తు ఆశలు పెట్టుకున్న తీరు ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి—వీరిలో ఎవరి కలలు నెరవేరతాయో!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *