
విభిన్నమైన పాత్రలు చేయాలనే తపన ఉన్న నటులలో మరాఠీ నటుడు ఉపేంద్ర లిమాయే పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవల టాలీవుడ్ ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్న ఉపేంద్ర, నిజానికి గతంలో ఒక సీరియస్ రోల్‌తో జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు.
ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి జోగ్వా అనే మరాఠీ సినిమాలో నటించిన ఉపేంద్ర. 2009లో విడుదలైన ఈ సినిమాలో తాయప్పా అనే పాత్రలో చీర కట్టిన గెటప్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పాత్రలోని నటనకు ఆయనకు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డ్ దక్కింది. ఈ చిత్రం దేవదాసీ సంప్రదాయ నేపథ్యంతో రూపొందింది.
ఇప్పటికీ ఆయనను చాలామంది పుష్ప 2 మూవీలో జాతర సన్నివేశాల్లో నటించిన నటుడిగా గుర్తుపడుతున్నారు. అయితే ఉపేంద్ర లిమాయే యానిమల్ సినిమాతో పాన్-ఇండియా గుర్తింపు పొందారు. ఆయన పాత్ర చిన్నదే అయినా, తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్‌తో కలిసి పూర్తి స్థాయి హాస్య పాత్రలో మెరిశారు.
ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలను కూడా సమర్థంగా పోషించగలిగే నటుడిగా ఉపేంద్ర టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విభిన్న పాత్రలపై ఆయన ఆసక్తి వల్లే ఇలాంటి విజయాలు సాధించగలిగారు.