Alia Bhatt Expresses Wish to Act with Fahadh Faasil
Alia Bhatt Expresses Wish to Act with Fahadh Faasil

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా మిగిలిపోయే గుర్తింపు తెచ్చుకున్న నటీమణి. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” వంటి మల్టీ లాంగ్వేజ్ బ్లాక్‌బస్టర్‌లో నటించి, తక్కువ స్క్రీన్ టైమ్‌ ఉన్నప్పటికీ తన నటనతో ముద్ర వేసింది. బహుళ భాషల్లో సినిమాలు చేసే ఈ స్టార్ హీరోయిన్, బాలీవుడ్‌ నటుడు రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న తర్వాత కూడా తన కెరీర్‌లో అప్‌టూ డేట్‌గా కొనసాగుతోంది.

తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న అలియా, ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో తన అభిమాన నటుడెవరో వెల్లడించింది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తనకు ఎంతో ఇష్టమని, ఆయనను తాను ఎంతో అభిమానిస్తానని పేర్కొంది. ఫహద్ నటన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, ముఖ్యంగా ఆయన నటించిన “ఆవేశం” చిత్రానికి తాను ఫ్యాన్‌ అయిపోయానని తెలిపింది.

అలియా మాట్లాడుతూ, అవకాశం వస్తే ఫహద్ ఫాజిల్‌తో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలను స్వీకరించే ఈ నూతన కాలంలో నటుల మధ్య ఉన్న రీజినల్ గాప్స్ కరిగిపోతున్నాయని అభిప్రాయపడింది. కరోనా కాలంలో అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలు ఒక్కటే అనే విషయం తాను స్పష్టంగా గుర్తించానని చెప్పింది.

ప్రస్తుతం అలియా “లవ్ అండ్ వార్” అనే సినిమాలో నటిస్తుండగా, త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *