Tollywood Rewind 2024 : ఈ ఏడాది  బెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే

  • బెస్ట్ సినిమా, సిరీస్ లిస్ట్ రిలీజ్ చేసిన ఐఎండీబీ
  • టాప్ వన్‌లో సంజయ్ లీలా భనాల్సీ హీరా మండి
  • సినిమాల్లో ప్రభాస్ కల్కికి ఫస్ట్ ర్యాంక్

ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేసింది. ఇక్కడే సౌత్ ఇండస్ట్రీకి చేదు అనుభవం ఎదురైంది. గూగుల్లో సత్తా చూపిస్తే.. ఐఎండీబీలో మాత్రం డీలా పడింది. సెర్చింజిన్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఐఎండీబీ కూడా ఈ ఏడాది టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితాను అందించింది. ఈ ఏడాది ఫస్ట్ నుండి నవంబర్ 25 మధ్య రిలీజైన చిత్రాల లిస్టును పరిగణనలోకి తీసుకుంది ఐఎండీబీ. పాపులర్ ఇండియన్ చిత్రాల్లో టాప్ ప్లేసును దక్కించుకుంది ప్రభాస్- నాగ్ అశ్విన్ సైన్ పిక్షన్ మూవీ కల్కి 2898ఏడీ.  స్త్రీ 2 సెకండ్ ప్లేస్, మహారాజా ధర్డ్ ప్లేసు తీసుకున్నాయి. ఫోర్త్, ఫిప్త్ బెంచ్‌లను సైతాన్, ఫైటర్ పంచుకున్నాయి
స్పాట్ః హిందీ సైతాన్ టీజర్

6వ స్థానాన్ని మంజుమ్మల్ బాయ్స్, ఏడు భూల్ భూలయ్యా 3, 8.కిల్, 9,10th బాలీవుడ్ మూవీస్ సింగం ఎగైన్, లాపతా లేడీస్ దక్కించుకున్నాయి. ఇవన్నీ కూడా మౌత్ టాక్ పరంగానే కాకుండా మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి.  అలాగే బెస్ట్ ఆఫ్ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ జాబితా విడుదల చేసింది. ఇక్కడే సౌత్ ఇండస్ట్రీకి దెబ్బ తగిలింది. వెబ్ సిరీస్ విషయంలో మాత్రం సదరన్ బెల్ట్ వెనకబడింది. కాదు కాదు పూర్తిగా ఫెయిలయ్యింది.
ఈ ఏడాది ఓటీటీలో సత్తా చాటిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ సంపాదించింది హీరామండి. సంజయ్ లీలా భన్సాలీ నుండి వచ్చిన ఈ కళాఖండంలో ఎంతో మంది ముద్దుగుమ్మలు కనిపించిన సంగతి విదితమే. ఇక దీని తర్వాత మీర్జాపూర్ సెకండ్ ప్లేస్, పంచాయత్ థర్డ్ బెంచ్ తీసుకున్నాయి. ఫోర్త్ ప్లేసును తీసుకుంది గ్యారెహ్.. గ్యారెహ్.ఇక ఒళ్లు హునం చేసుకుని ఫైట్స్ చేసినందుకు సమంత నటించిన వెబ్ సిరీస్ సీటాడెల్‌కు తగిన గుర్తింపే దక్కింది. ఐదో స్థానంలో నిలిచింది. సిస్త్, సెవెన్త్‌లో మామ్ల లీగల్ హై, టాజా ఖబర్ ఉన్నాయి. 8, 9thలో మర్డర్ కా మహిమ్, శేఖర్ హోం ఉండగా  10 ప్లేసులో ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో వెబ్ సిరీస్‌ల జాబితాలో నిలవడం విశేషం. ఈ మొత్తంలో ఒక్కటంటే ఒక్క సౌత్ వెబ్ సిరీస్ లేకపోవడం సాడ్.
బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా సాలిడ్ హిట్స్ ఇచ్చి బాలీవుడ్‌కు సవాలు విసురుతున్న సౌత్ సినిమాలు.. ఓటీటీ వెబ్ సిరీస్‌ల విషయానికి వచ్చే సరికి పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. వెబ్ సిరీస్‌లు చేస్తున్నా నార్త్ సిరీస్‌లకు వస్తున్న బజ్, హైప్ వీటికి రావాట్లేదు. మరీ ఇది సౌత్ సినిమాకు గట్టి ఎదురు దెబ్బే కదా. ఫలితం లిస్టులో ప్లేసు దక్కకపోవడం. ఈ లెక్కన ఓటీటీలో కూడా సౌత్ బెల్త్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టాలీవుడ్. భారీ బడ్జెట్ చిత్రాలనే కాదు.. ఇక భారీ లెవల్లో ఓటీటీ సిరీస్‌లను తీసుకురావాల్సిన నీడ్ ఉంది. అప్పుడే అటు థియేటర్లలో, ఓటీటీలో నార్త్ ఇండస్ట్రీని క్లియర్ రూల్ చేసినట్లు అవుతుంది. మరీ ఆ దిశగా మన దర్శక, నిర్మాతలు ఫోకస్ చేస్తారా చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *