అనంత్ అంబానీ (anant ambani) పెళ్లిలో మెరిశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Superstar mahesh babu). ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ పెళ్లికి వెళ్లారు. సోషల్ మీడియాలో మహేశ్ అంబానీ ఇంట పెళ్లిలో సందడి చేస్తున్న ఫొటోస్, వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ తో పాటు నమ్రత (Namrata), కూతురు సితార (Sitara ghattamaneni) అంబానీ ఇంట పెళ్లి సందడిలో పాల్గొన్నారు. ఈ ఫొటోస్ లో మహేశ్ లుక్ కొత్తగా కనిపిస్తోంది.

మహేశ్ లాంగ్ హెయిర్ కట్ తో రాజమౌళి (SS rajamouli) సినిమా (SSMB 29) కోసం మేకోవర్ అయినట్లు తెలుస్తోంది. దేశంలో జరుగుతున్న ఖరీదైన పెళ్లిగా అనంత్ అంబానీ వివాహ వేడుకలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరవుతున్నారు. మూడు రోజుల పాటు సాగే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు నిన్నటి నుంచి మొదలయ్యాయి.