బాలయ్య-బోయపాటి మూవీకి ముహూర్తం ఫిక్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 15, 2024 10:23 PM IST

నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు వరుస హిట్లుగా నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక బోయపాటి తన నెక్స్ట్ మూవీని మరోసారి బాలకృష్ణతో చేయబోతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో వీరి కాంబినేషన్‌లో రాబోయే నాలుగో సినిమా ఖచ్చితంగా ‘అఖండ-2’ అయి ఉంటుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కాగా, ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలతో పాటు టైటిల్ లాంచ్ ఈవెంట్‌ను అక్టోబర్ 16న ఉదయం 9 గంటల నుండి ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇక ఈ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న నాలుగో సినిమా నిజంగానే ‘అఖండ-2’ అవుతుందా లేక వేరే ఏదైనా సినిమానా అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *