- క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు
- తనపై నమోదైన FIR కొట్టివేయాలని కోరిన అల్లు అర్జున్
- హైకోర్టులో అల్లు అరవింద్, త్రివిక్రమ్, దిల్‌రాజు
అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. ఇప్పటివరకు అల్లు అర్జున్ కి బెయిల్ లభించవచ్చు అని అందరూ భావిస్తూ వచ్చారు. నిజానికి అల్లు అర్జున్ మీద నమోదు చేసిన కేసు నాన్ బెయిలబుల్ అయినా ఆ కేసులో 11వ నిందితుడు కావడంతో బెయిల్ ఈజీగా లభించవచ్చు అని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే నాంపల్లి కోర్టు అందరికీ షాక్ ఇస్తూ ఈ కేసులో అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. మరొకపక్క అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ మీద ప్రస్తుతానికి హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో తీర్పు వచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అల్లు అర్జున్ తరఫు లాయర్లు నాంపల్లి కోర్టు న్యాయమూర్తికి దృష్టికి తీసుకువెళ్లారు.
Allu Arjun: హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. మినిట్ టు మినిట్ ఏమైంది?
అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పోలీసులు మాత్రం 14 రోజుల రిమాండ్ వార్త బయటకు వచ్చిన వెంటనే అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అభిమానులు ఎవరు అడ్డు రాకుండా ఉండేందుకు రోప్ పార్టీని సైతం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ జైలుకు తరలించాల్సి వస్తే ఎక్కడ అడ్డంకులు లేకుండా పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది? అల్లు అర్జున్ ని జైలుకు తరలిస్తారా? లేదా? తరలిస్తే ఏ జైలుకు తరలిస్తారు? లాంటి విషయాలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకరకంగా నాంపల్లి కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పక తప్పదు.