- అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్
- బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన తరువాత అల్లు అర్జున్ ని చంచల్గూడ జైలుకు తరలించారు. ఆయనకు ఇక 14 రోజుల పాటు జైల్లో రిమాండ్ లో ఉంచుతారు అనుకుంటున్న సమయంలో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద వాదోపవాదాలు సాగాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కి వర్తించవని కోర్టు తేల్చి చెప్పింది. అల్లు అర్జున్ ను నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
Allu Arjun: చంచల్ గూడ జైలు లోపలికి అల్లు అర్జున్
అల్లు అర్జున్ కి కూడా జీవించే హక్కు ఉందని పేర్కొన్న హైకోర్టు కేవలం నటుడు కాబట్టి 105 బి 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్ కి ఆపాదించాలా అని పోలీసులను ప్రశ్నించింది. రేవతి కుటుంబం పై హైకోర్టుకు సానుభూతి ఉందని అంతమాత్రాన నేరాన్ని నిందితుల మీద రుద్దలేమని వ్యాఖ్యానించింది.. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఎట్టకేలకు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ లభించింది. దీంతో అల్లు అర్జున్ ను చంచల్గూడా జైలు నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అల్లు అర్జున్ తరఫు లాయర్లు. ఇక ఈ కేసుని వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.