Tourist Family movie now streaming on Hotstar
Tourist Family movie now streaming on Hotstar

తక్కువ బడ్జెట్, స్టార్ హీరోలేని సినిమా.. కానీ ప్రేక్షకులను నవ్వించి, ఏడిపించి, మనసులను గెలిచింది. అదే టూరిస్ట్ ఫ్యామిలీ. తమిళంలో మే 1న విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రచారం లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రముఖ నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించగా, అభిషాన్ దర్శకత్వం వహించారు.

ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఎమోషన్స్ మేళవించిన ఈ చిత్రం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంది. స్టార్ డైరెక్టర్లు, హీరోలైన రజనీకాంత్, ఎస్.ఎస్. రాజమౌళి, నాని, శివ కార్తికేయన్ లాంటి వారు ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు.

ఇప్పుడు ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయితే, ఇంట్లో కుటుంబంతో కలిసి ఈ సినిమాను తప్పక చూడాల్సిందే.

టూరిస్ట్ ఫ్యామిలీ నిరూపించింది – కంటెంట్ ఉండాలి కానీ స్టార్ లు అవసరం లేదు. ఇది ప్రతి సినీ ప్రేమికుడు తప్పకుండా చూడాల్సిన సినిమా!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *