పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు మారుమ్రోగుతుంది. కల్కి సినిమాతో రికార్డులు బద్దలు కొడుతున్నారు ఈ రెబల్ స్టార్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో వెయ్యి కోట్లు అందుకున్న హీరోల సినిమాల్లో రెండు సినిమాలు ప్రభాస్ వే.. ఒకటి బాహుబలి కాగా.. రెండో సినిమా కల్కి..ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా మిర్చి . బాహుబలి సినిమా కంటే ముందు రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. మిర్చి సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా అనుష్క , రీచా గంగోపాధ్యాయ నటించారు. అలాగే ఈ సినిమాలో రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ లో అనుష్క పక్కడ సైడ్ డాన్సర్ గా చేసిన ఈమెను గుర్తుపట్టారా.?

మిర్చి సినిమాలోని డార్లింగే ఓసి నా డార్లింగే అనే సాంగ్ లో అనుష్క పక్కన కనిపించిన ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటి. సినిమాలతో పాటు బుల్లితెర పై కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న నటి ఆమె.. ఇంతకు ఆమె ఎవరు అని అనుకుంటున్నారా.? ఆమె భాను శ్రీ. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న పటాస్ అనే టీవీ షో తో బుల్లితెర మీద యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. అయితే ఆమె యాంకర్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్నపాత్రలు చేసింది. కానీ ఆ సినిమాలు భాను శ్రీకి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆతర్వాత యాంకర్ గా మారి కొన్ని షోల్లో చేసింది. బుల్లి తెర పై యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది భాను శ్రీ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.