బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ (Nabha natesh) నటించిన కొత్త సినిమా ‘డార్లింగ్’. ఈ మూవీలో ప్రియదర్శి (priyadarshi) హీరోగా నటించారు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన డార్లింగ్ (Darling) జూలై 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీలో నటించిన ఎక్సీపిరియన్స్ షేర్ చేసింది నభా నటేష్.

నభా నటేష్ మాట్లాడుతూ – దాదాపు రెండేళ్ళుగా నా నుంచి సినిమా రిలీజ్ లేదు. థియేటర్స్ లో ప్రేక్షకులు నన్ను చూడటానికి, నేను నన్ను థియేటర్స్ లో చూసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఆడియన్స్ కి నా ఎనర్జీ ఇష్టం. యాక్సిడెంట్ వలన నా సోల్జర్ కి గాయమైయింది. మళ్ళీ ఫుల్ గా ఫిట్ అయి మునుపటి ఎనర్జీ వచ్చిన తర్వాతే స్క్రీన్ మీద కనిపించాలని భావించాను. అందుకే బ్రేక్ వచ్చింది. ఎంటర్ టైనింగ్ గా వుండే రోల్స్ ని పిక్ చేయడానికి ఇష్టపడతాను. డార్లింగ్ సినిమాలో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాననే జోన్ లో అప్రోచ్ అయ్యాను. ఇందుకోసం చాలా హోం వర్క్ చేశాను. స్ప్లిట్ పర్సనాలిటీ వున్నా చాలా సినిమాలు చూశాను. అలాగే చెన్నై నుంచి ఒక యాక్టింగ్ స్పెషిలిటేటర్ కూడా వచ్చారు. నాకు అన్ని రకాల సబ్జెక్ట్స్ ఇష్టం. ప్రతిసారి కొత్తగా చేయాలనేది నా ప్రయత్నం. డార్లింగ్ లో చేసిన రోల్ నా డ్రీమ్ రోల్. ‘స్వయంభూ’తో పాటు మరో రెండు సినిమాలు డిస్కషన్ లో వున్నాయి. అని చెప్పింది.