రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ అనే సినిమా తెరకెక్కిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ 8 2021వ తేదీన అధికారికంగా లాంచ్ అయింది. అంటే మొన్న సెప్టెంబర్ నెలకు దాదాపు మూడేళ్లు పూర్తయ్యాయి. శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ సినిమా, భారీ సెట్లు వేయాల్సి ఉంటుంది. కానీ మరీ ఇంత మూడేళ్లు పట్టే సమయం అవసరమా అని ఎంతోమందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దానికి తోడు మధ్యలో ఇండియన్ సినిమాని కూడా షూట్ చేయాల్సి రావడంతో అందువల్లే ఈ సినిమా లేట్ అయిందని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఈ సినిమా లేట్ అవ్వడానికి అసలు కారణం తాజాగా శ్రీకాంత్ వెల్లడించారు. శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు.
Vrushabha: మోహన్ లాల్ వృషభ ఇక లేనట్టే!
బొబ్బిలి సత్యమూర్తి అనే ముఖ్యమంత్రి పాత్రలో ఆయన నటించారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తున్న ఆయన ఈ సినిమాలో ఎక్కువగా కాంబినేషన్ సీన్స్ ఉండడం వల్లే సినిమా లేట్ అయిందని అన్నారు. తమతో పాటు మిగతా నటీనటులు అందరూ దాదాపుగా స్టార్ యాక్టర్స్, వాళ్ళందరూ వేరే వేరే సినిమాల్లో కూడా బిజీగా ఉంటారు. కొన్ని షెడ్యూల్స్ మారడం వల్ల ఒకరితో ఒకరికి కాంబినేషన్ సీన్స్ సెట్ అవ్వలేదని ఆ సీన్స్ సెట్ అవ్వడం కోసమే దాదాపు ఏడాదిన్నర పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామాలా ఉంటుందని కచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలానే ఉంటుందని అన్నారు.కర్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోవచ్చు కానీ శంకర్ ఎప్పుడూ దర్శకుడిగా ఫెయిల్ అవ్వలేదని ఈ సందర్భంగా శ్రీకాంత్ వెల్లడించారు.