పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ప్రభాస్, మరో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే, వీటితో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ సినిమా కూడా లైన్లో ఉంది.
కాగా, ఇప్పుడు ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్ట్‌ని ఓకే చేసినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో ‘హను-మాన్’ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ మార్క్ వేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, రీసెంట్గా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయ్యింది. దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ మూవీని ప్రభాస్‌తో చేసేందుకు సిద్ధమవుతున్నాడట.
ఇప్పటికే ప్రభాస్‌కి ఓ స్టోరీలైన్ వినిపించిన ప్రశాంత్ వర్మ, ఈ ప్రాజెక్ట్‌ని త్వరలోనే అనౌన్స్ చేయాలని చూస్తున్నాడట. అటు ప్రభాస్ కూడా జనవరిలో ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
The post మరో ప్రాజెక్ట్ ఓకే చేసిన ప్రభాస్..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.