ఇంటర్వ్యూ : నటుడు శ్రీకాంత్ – ‘గేమ్ ఛేంజర్’లో అప్పన్నగా రామ్ చరణ్ అదరగొట్టాడు! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ముఖ్య పాత్రను పోషించిన శ్రీకాంత్ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

గేమ్ ఛేంజర్ లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు ఉంటుంది. గేమ్ చేంజర్ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకు ఎందుకు చెబుతున్నారా? అని అనుకున్నాను. సెకండాఫ్ చెప్పిన తరువాత ఈ పాత్రను కచ్చితంగా నేనే చేయాలని అనుకున్నాను. నా కారెక్టర్ అంత బాగా ఉంటుంది. గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ ప్రోస్థటిక్ మేకప్‌కే నాలుగు గంటలు పట్టేది.

ప్రోస్థటిక్ మేకప్‌లో నటించడం ఎలా అనిపించింది?
నేను ఇంత వరకు ప్రోస్థటిక్ మేకప్‌ వేసుకుని నటించలేదు. కానీ అలాంటి మేకప్ ధరించి నటించడం చాలా కష్టం. చెమటలు పట్టినా మేకప్ మారిపోతుంది.

శంకర్ గారి వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
శంకర్ గారి పనితనం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సహనంతో ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ప్రతీ కారెక్టర్‌ను ఆయన నటించి చూపిస్తారు.

గేమ్ ఛేంజర్‌లో మీ పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో ఉంటుందా? పాజిటివ్‌గా ఉంటుందా?
నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా సస్పెన్స్‌లు ఉంటాయి. అవన్నీ చెప్పొద్దని అన్నారు. గెటప్ వేసిన వెంటనే ఆ కారెక్టర్ తాలుకా షేడ్స్ అన్నీ వచ్చేస్తాయి. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమాకు చాలా ముఖ్యమైన కారెక్టర్. ఇంత మంచి అవకాశం రావడం అదృష్టం.

ఎవరితో ఎక్కువ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి?
ఎస్ జే సూర్య, జయరాం, సముద్రఖని, రామ్ చరణ్ ఇలా అందరితోనూ సీన్లు ఉంటాయి. ఎస్ జే సూర్య పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సరిపోదా శనివారం పాత్రను మించేలా ఉంటుంది.

రామ్ చరణ్ మళ్లీ వర్క్ చేశారు? అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమైనా గమనించారా?
గోవిందుడు అందరివాడేలే చిత్రం టైంలో రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు చాలా ఎదిగాడు. గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు. రామ్ చరణ్ నన్ను ఎప్పుడూ అన్నా అని ఆప్యాయంగానే పిలుస్తాడు.

గేమ్ ఛేంజర్ చిత్రం ఎలా ఉండబోతోంది?
ప్రస్తుతం ఎలివేషన్స్‌తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్‌తోనే ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. శంకర్ గారి ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.

గేమ్ ఛేంజర్ చిత్రానికి సీక్వెల్ వంటివి ఏదైనా ఉంటుందా?
కార్తిక్ సుబ్బరాజ్ గారు మంచి రచయిత. ఆయన రాసిన కథ శంకర్ గారికి చాలా నచ్చింది. అందుకే సినిమాను చేసేందుకు ముందుకు వచ్చారు. దిల్ రాజు గారు కూడా ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ మూవీకి సీక్వెల్ వంటివి ఏమీ ఉండవు.

రాబోవు చిత్రాలు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటోంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటు గట్టులో నటిస్తున్నాను. కళ్యాణ్ రామ్ మూవీలో నటిస్తున్నాను. సుష్మిత గోల్డెన్ బాక్స్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను.

The post ఇంటర్వ్యూ : నటుడు శ్రీకాంత్ – ‘గేమ్ ఛేంజర్’లో అప్పన్నగా రామ్ చరణ్ అదరగొట్టాడు! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *