సంక్రాంతి బరిలో నుంచి మరో సినిమా ఔట్..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 16, 2024 7:03 AM IST

టాలీవుడ్‌లో దీపావళి పండుగకు కొన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే అసలైన వార్ మాత్రం సంక్రాంతి సీజన్‌లో జరగనుంది. ఇఫ్పటికే సంక్రాంతి రేస్‌లో పలు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని సినిమాలు ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి.

అయితే, ఈసారి సంక్రాంతి బరిలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’పైనే అందరి చూపులు ఉన్నాయి. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే, అంతకుముందే ఈ పండుగ సీజన్‌లో కర్చీఫ్ వేసుకున్నాయి రెండు సినిమాలు. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మూడో సినిమా.. అలాగే దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK109 మూవీ కూడా ఉంది.

కానీ, ఇప్పుడు సంక్రాంతి బరిలో నుండి ఓ సినిమా తప్పుకుంటున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి, వెంకీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా రిలీజ్‌ను వాయిదా వేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి గల కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమా ఒకవేళ నిజంగానే పోటీ నుండి తప్పుకుంటే, మరో హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘తండేల్’ మూవీకి ఇది అడ్వాంటేజ్‌గా మారనుంది. ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ఆ చిత్ర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *