Published on Dec 15, 2024 11:12 AM IST
ప్రముఖ దివంగత నటుడు రాజ్‌కపూర్ శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌కపూర్ నటించిన పలు ప్రత్యేక చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ నటి డింపుల్ కపాడియా, రణధీర్ కపూర్, అలియా-రణ్‌బీర్, కరీనా-సైఫ్ అలీ ఖాన్, రిద్దిమా కపూర్ తదితరులు హాజరు అయ్యి, రాజ్‌కపూర్ తో తమకున్న అనుంబంధాన్ని పంచుకున్నారు.
ముందుగా డింపుల్ మాట్లాడుతూ.. ‘రాజ్‌కపూర్ గారు తెరకెక్కించిన ‘బాబీ’ చిత్రంతోనే నేను నటిగా మారాను. ఆ సినిమాలో నా పాత్రకు సంబంధించిన దుస్తులన్నింటినీ విదేశాల నుంచి దిగుమతి చేయడం అప్పట్లో నాకు ఆశ్చర్యంగా అనిపించింది. రాజ్‌కపూర్ గారు ఎప్పుడూ తన సినిమాలోని కథానాయిక లుక్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు. నాకు తెలిసి ఇలాంటి దర్శకులు ఎవరూ ఉండరేమో. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇదే నిదర్శనం’ అని డింపుల్ చెప్పుకొచ్చారు. దర్శకుడు రాహుల్ రావైల్ మాట్లాడుతూ.. ‘రాజ్ దేవుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి’ అని తెలిపారు.