- చివరి దశకు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8
- సెప్టెంబర్ 1న ప్రారంభమైన షో
- నేడు గ్రాండ్ ఫినాలే
- ప్రైజ్‌మనీ ప్రకటించిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. కొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు శుభం కార్డు పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
READ MORE: Eluru Crime: ఏలూరులో దారుణం.. యువకుడిని మందలించిన బాలిక తండ్రి మృతి!
ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఫినాలేలో సందడి చేశారు. టాప్ 5లో ఉన్న నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్‌పై పంచులతో అలరించారు. ఇందులో గౌతమ్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. “రెండు పెళ్లి సంబంధాలు చూశాం. బయటకు రాగానే గౌతంకి వివాహం చేస్తాం.” అని తెలిపారు. నిఖిల్ తల్లి మాట్లాడుతూ.. నిఖిల్ విషయంలో తాను చాలా గర్వంగా పడుతున్నట్లు తెలిపారు. తల్లి మాటలతో నిఖిల్ భావోద్వేగానికి గురయ్యాడు.
READ MORE:Save The Girl Child: సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలి: హోంమంత్రి అనిత
కాగా.. ఈ సీజన్ ప్రైజ్‌మనీ రూ.54,99,999 అని ప్రకటించిన నాగార్జున దానిని రూ.55 లక్షలుగా నిర్ణయించారు. గెలిచిన విజేతకు టైటిల్‌తోపాటు ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. లక్ష్మిరాయ్, నభానటేశ్ డ్యాన్సులతో అలరించారు. ఉపేంద్ర, ప్రగ్యాజైశ్వాల్ అతిథులుగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. సీజన్ 8లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. మెయిన్ కంటెస్టెంట్లు 14 మంది, వైల్డ్ కార్ట్ ఎంట్రీలతో 8 మంది షోలో పాల్గొన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్‌కు చేరుకున్నారు. నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్, అవినాష్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని గంటల్లో విజేత ఎవరనేది బయటపడుతుంది.