Published on Dec 15, 2024 2:07 PM IST
డైరెక్టర్ క్రిష్, అనుష్క ప్రధాన పాత్రలో ఘాటీ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి తాజాగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ను రివీల్ చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని ఈ వీడియోలో అనుష్క రివీల్ చేసింది. ఇక ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియోలో అనుష్క చీర కట్టుకొని తలపై ముసుగు వేసికొని నడుస్తూ వెళ్లపోతున్నట్టు చూపించారు
కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. ఇక ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఘాటీ అమెజాన్ లోకి రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
‘The Queen’, at her best, will reign at the box office ❤️????
▶️ https://t.co/XyPFTiuSLI#Ghaati GRAND RELEASE WORLDWIDE ON 18th APRIL, 2025 ????????
In Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.
‘The Queen’ #AnushkaShetty @DirKrish @UV_Creations @FirstFrame_Ent pic.twitter.com/FrV2q3hNVo
— UV Creations (@UV_Creations) December 15, 2024