- మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ..
- జల్‌పల్లిలో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం.
- మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోసిన విష్ణు.
- పహాడీషరీఫ్ పీఎస్‌కు రానున్న మంచు మనోజ్.
Manchu Vishnu: గత నాలుగు రోజులనుంచి మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో తెగ హల్చల్ చేస్తోంది. నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య జరిగిన వివాదం కారణంగా ఇరువురు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొదట దెబ్బలు తగిలాయని మనోజ్ ఆసుపత్రికి రాగా, ఆ తర్వాత మంచు మోహన్ బాబు దంపతులు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ విడుదలయ్యారు కూడా. ఆ తర్వాత ఈ ఘటనల నేపథ్యంలో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేయి చేసుకున్న సంఘటన కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై మోహన్ బాబు మీడియాకు క్షమాపణ తెలియజేశారు. అయితే ఈ వాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోసారి మంచి వారి ఫ్యామిలీలో మరో వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: Lavanya Tripathi as Sati Lilavati: పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన మెగా కోడలు.. ‘సతీ లీలావతి’ అంటూ
జల్‌పల్లిలోని మంచువారి ఇంటి వద్ద మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం జరిగింది. మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోశారు ఆయన అన్న మంచు విష్ణు. దాంతో మంచు మనోజ్ ఇంటికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. దాంతో ఈ విషయంపై పహాడీషరీఫ్ పీఎస్‌కు మంచు మనోజ్ కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.