- మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్ట్ పరిణామాలపై చర్చ.
Allu Arjun: హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. నాగబాబు ఇంటికి తన భార్య స్నేహారెడ్డితో కలిసి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్ట్ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. అంతకు ముందు అల్లు అర్జున్ సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ లంచ్ చేసిన అనంతరం నాగబాబు ఇంటికి వెళ్లారు. తన ఇంటికి విచ్చేసిన అల్లు అర్జున్ దంపతులకు నాగబాబు సాదర స్వాగతం పలికారు. అల్లుఅర్జున్ను ఆత్మీయంగా హత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. కష్ట సమయంలో మెగా ఫ్యామిలీ అండగా నిలవడం పట్ల బన్నీ కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిసింది. మరోవైపు పవన్ కల్యాణ్ మాత్రం అల్లు అర్జున్ను కలవకుండానే హైదరాబాద్ నుంచి నేరుగా ఏపీకి వెళ్లినట్లు సమాచారం. శనివారం అంతా బన్నీ ఇంటికి సెలెబ్రిటీలు క్యూ కట్టారు. అల్లు అర్జున్ ఆదివారం ఇలా మెగా ఇంటి బాటపట్టారు. ఉదయం మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు అల్లు ఫ్యామిలీ అంతా వెళ్లింది. లంచ్ చేస్తూ దాదాపు గంటకు పైగానే ముచ్చట్లు పెట్టారు.
Read Also: Manchu Vishnu: మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ..
శుక్రవారం జరిగిన హైడ్రామా గురించి అందరికి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించి.. వెంటనే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వాదోపవాదనలు జరుగుతుండగానే.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాయంత్రం 6 గంటల తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కానీ అప్పటికే అల్లు అర్జున్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్ ఆర్డర్ కాపీ సరిగ్గా లేదని, ఇంకా అప్లోడ్ చేయలేదనే సాకులు చెప్పి ఆ రాత్రంతా బన్నీన జైల్లోనే పెట్టారు. ఉదయం ఆయనను విడుదల చేశారు. అయితే శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు బన్నీ ఇంటికి సినీ ప్రముఖులు క్యూలు కడుతూనే ఉన్నారు. అలా అల్లు అర్జున్‌కు అండగా టాలీవుడ్ మొత్తం ఉందనే సంకేతాన్ని పంపించేశారు.