Manchu Family: మంచు కథా చిత్రమ్.. పోలీసులకు ఫిర్యాదు చేయనున్న మనోజ్

మంచు కుటుంబ కథా చిత్రానికి ఇంకా శుభం కార్డు పడ్డట్టు కనిపించడం లేదు. ముందుగా మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య జరిగిన వివాదం కారణంగా ఇరువురు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ లు ఇచ్చుకున్నారు. మొదట దెబ్బలు తగిలాయని మనోజ్ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆ తరువాత మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం, ఆ తర్వాత మంచు మోహన్ బాబు దంపతులు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయి విడుదలవడం వరుస వరుసగా జరిగాయి. ఇదంతా ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి మంచి వారి ఫ్యామిలీలో మరో వివాదం చోటు చేసుకుంది. మొన్న రాత్రి మంచు ఇంట్లో జల్‌పల్లిలో మోహన్‌బాబు భార్య బర్త్‌డే పార్టీ జరుగుతుండగా కరెంట్‌ పోయింది. ఆ సమయంలో జనరేటర్‌ను ఆన్‌ చేసి చేయడానికి చూస్తే అందులో పంచదార ఉంది.

Allu Arjun: శ్రీతేజ్‌ కోసం సింగపూర్‌ నుంచి ఇంజెక్షన్‌ తెప్పించిన అల్లు అర్జున్?

జనరేటర్‌లో తన అన్న మంచు విష్ణు, అలాగే మరి కొందరు పంచదార పోసినట్లు ఆరోపించారు మనోజ్. కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పంచదార పోశారని మంచు మనోజ్‌ ఆరోపిస్తున్నారు. తనతోపాటు కుటుంబసభ్యులను కరెంట్‌ పిక్షన్‌ చేసి చంపాలని కుట్ర చేసారని, నాతోపాటు భార్య, పిల్లలు, తల్లిని చంపే ప్రయత్నం జరిగిందని, వారం రోజుల క్రితం కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేశానని, వాళ్లే ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు నిన్న చేస్తారని అనుక్నుటే మంచు మనోజ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. ఇవాళ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. మొన్న జరిగిన ఘటనతో కుటుంబసభ్యులు భయాందోళన చెందారని, తన భార్య ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని ఆయన పేర్కొన్నారు. తన భార్యను దగ్గరుండి చూసుకోవాల్సి ఉంది.. నేను బయటకు రాలేనని పేర్కొన్న ఆయన ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *