Tollywood : ప్లాప్‌లో ఉన్న హీరోకి హిట్టిచ్చే డైరెక్టర్ ఎవరో..?

  • యంగ్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్న బెల్లంకొండ
  • ప్రజెంట్ చేతిలో త్రీ ప్రాజెక్ట్స్.. ఇప్పుడు మరొకటి
  • పొలిమేర దర్శకుడికి గ్రీన్ సిగ్నల్

కొన్నేళ్లుగా  ఆ హీరోతో హిట్ దోబూచులాడుతోంది. గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. వరుసగా యంగ్ డైరెక్టర్లతో ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు.  కానీ హిట్ మాత్రం దక్కలేదు.  టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు సాయి శ్రీనివాస్. ఫస్ట్ మూవీ అల్లుడు శీనుతో హిట్  అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు ఈ బెల్లకొండ వారసుడు. ఈ పదేళ్ల కెరీర్‌లో దాదాపు తొమ్మిది సినిమాలు చేస్తే  రాక్షసుడు మాత్రమే హిట్స్.  మిగతా సినిమాలు వేటికవే డిజాస్టర్స్.

ఇక్కడ లాభం లేదనుకొని బాలీవుడ్ బాట పట్టాడు. ఇక్కడి ప్లాప్ సినిమాలు నార్త్ లో యూట్యూబ్‌లో సెన్సేషనల్ వ్యూస్ క్రియేట్ చేస్తున్నాయి. ఆయా ధైర్యంతో ప్రభాస్ చత్రపతి మూవీని ఇదే పేరుతో రీమేక్ చేసి నార్త్‌లో వదిలితే పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. దీంతో బాలీవుడ్ కు బై చెప్పేసి టాలీవుడ్ కు వచేసాడు.   ఈసారి కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంట్ కథలను ఎంచుకుంటున్నాడు.  బెల్లకొండ లైనప్స్ చుస్తే ఈ సారి హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నాడు. తమిళ హిట్ సినిమా  గరుడన్‌ ను  భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అలాగే  సాగర్ చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ ఇద్దరితో పాటు కౌశిక్ పెగళ్లపాటి, లూధీర్ బై రెడ్డి అనే యంగ్ డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నాడు. ఇక తాజగా మా ఊరి పొలిమేర 1, 2లతో టాలెంట్ డైరెక్టర్‌గా ఫ్రూవ్ చేసుకున్న అనిల్ విశ్వనాథ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇది కూడా థ్రిల్లర్ మూవీగా రాబోతుందని టాక్.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *